సంస్కృతి
భారతీయ సాంస్కృతిక పరిరక్షణ
భారతజాతి క్రమంగా సాంస్కృతిక గుర్తింపు కోల్పోతున్నదని (రిటైర్డ్) జనరల్ వి.వి. మాలిక్ జాతిని ఉద్దేశించి హెచ్చరించారు. భారతజాతి భద్రత-గుర్తింపు 21వ శతాబద్దపు సవాళ్లు అనే అంశంపై కలకత్తాలో రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును డా||శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 107వ జయంతిని పురస్కరించుకొని డా|| శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశోధనా మండలి వారు (సంస్థ) నిర్వహించారు.
ఈ రెండు రోజుల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా (రిటైర్డ్) జనరల్ వి.వి. మాలిక్ (పూర్వపు సర్వసైనా ధ్యక్షుడు) హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. వారు ఈ సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో బలహీన మైన దేశంగా మారిందని భారతదేశంలోని నలుమూలల ఉత్తరాదినుండి దక్షిణాది వరకు అలాగే తూర్పు ప్రాంతం నుండి పశ్చిమ వాయువ్య ప్రాంతం వరకు ప్రజలు అభద్రతకు, భయాలకు లోనవుతున్నారని, అయినా రాజకీయ నాయకులు నిద్రమత్తులో జోగుతున్నారని విమర్శించారు. దీనికంతటికీ కారణం రాజకీయ నాయకులు సాయుధ దళాల సిఫారసులను, సూచనలను పెడచెవిన పెట్టడమే కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయ సాంస్కృతిక పరిరక్షణ, బలమైన సాయుధ బలగాల సహాయంతో పరిరక్షించవలసిన అవసరం ఏర్పడిందని వారు ఉద్భోదించారు. ఈ సదస్సులో అరణ్‌శౌరి భారత్‌పై చైనా దురాక్రమణ వ్యూహాలను ఎండగట్టారు. చైనా ప్రాథమికంగా భారతదేశ సరిహద్దులోపలి ప్రాంతాలపై పదేపదే దాడిచేస్తూ ఆ తరువాత సైనిక దురాక్రమణ చేస్తున్నదని, ఈ పరిస్థితిని తిప్పి కొట్టి ఉత్తర ఈశాన్య భాగాలను రక్షించుకోటానికి రక్షణ దళాలను పట్టిష్టం చేసుకోవటం మినహా వేరే గత్యంతరం లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాకిస్తాన్‌లో భారత (మాజీ) హైకమీషనర్ జి. పార్థసారధి, పలువురు రక్షణ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాశి ఫలాలు






