రాష్ట్రీయం
అమలు తీరు బాగాలేదని ఆనాడే చెప్పా : బాబు
కుప్పం, కె.ఎన్.ఎన్ : రాష్ట్రంలోని మైనార్టీ ఓటర్లను దక్కించు కోనేం దుకు రాజశేఖర్‌రెడ్డి ప్రభు త్వం హడావుడిగా అవగా హన లేకుండా మైనార్టీ లకు రిజర్వేషన్ కల్పిస్తా మంటూ ప్రకటించిన విషయం పై తెలుగుదేశం పార్టీ ఆనాడే మైనార్టీ రిజర్వేషన్ అమలు తీరు బాగాలేదని చెప్పామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... మైనార్టీలకు రిజర్వేషన్లతోపాటు రాజకీయ రిజర్వేషన్ కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు రాష్ట్ర హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్ గురించి తప్పుపట్టిందని తెలుగుదేశం పార్టీ త్వరలోనే జడ్జిమెంట్ కాఫీలను చూసి స్పందించడం జరుగుతుందన్నారు. మైనార్టీ సోదర్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సి బాధ్యత ప్రభుత్వం పై ఉందని, దానికి అనుగుణంగా సాధ్యా సాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిందని, పేద ప్రజలు వాటిని కొనలేని పరిస్థితులు ఏర్పడందని, ధరలు తగ్గించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. రెండవ సారి అధికారంలోకి రావడం కోసం విచ్చలవిడిగా రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తరువాత రేషన్ కార్డులను తొలగిస్తున్నారని, అలాగే పింఛన్లను కూడా రద్దు చేస్తున్నారని, ఇది ఎంత వరకు సబబు అని యఆయన వాపోయారు. రాబోయే రోజుల్లో కిరోసిన్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల పై మరింత భారం వేసేందుకు సతమతమౌతున్నదని ఆయన అన్నారు. ఆర్టీసి ధరలు వ్యాట్ ట్యాక్స్ రెండు శాతం పెంచి ప్రజల పై వెయ్యి కోట్ల అదనపు భారం వేసిందని, అలాగే కరెంటు ఛార్జీ కూడా పెంచేందుకు కూడా సిద్ధమవుతుందని, ధరలు తగ్గించకపోవడం వల్ల పేద ప్రజలు బ్రతుకులు మరింత దుర్భిర్యం అవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా తయారైందని, విజయవాడలో చిన్నారి వైష్ణవి హత్య ఇందుకు నిదర్శనమని, అలాగే నాటుసారా తాగి చాలా మంది మృత్యువాత పడ్డారని హైదరాబాద్‌లో నాసిరకం భవన నిర్మాణంతో కూలీలు చనిపోయారని, రాష్ట్రం దుర్భిర్య పరిస్థితులు ఎదుర్కొంటున్నదని ఆయయన అన్నారు. పేద ప్రజలు చితికిపోయే పరిస్థితులు ఏర్పడిందని, చేనేత, మత్స్య కారులు అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారని, పేద ప్రజలు ఇళ్లు కట్టుకొనే పరిస్థితులు లేరని, ముడిసరుకుల ధరలు విపరితంగా పెరిగిపోయిందని ఆయన అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లులో తీవ్ర అవినీతి చోటుచేసుకున్నదని, కాంగ్రెస్ కార్యకర్తలు రెండుమూడేసి ఇళ్ళు మంజూరు చేయించుకున్నారని, పేద ప్రజల బిల్లుల విషయంలో ప్రతి బిల్లులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శాఖలోనూ అవినీతి ఎక్కువైందని, అధికారులు నిద్రపోతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటపడిందని, పాఠశాల్లో టీచర్లు లేక విద్యార్థులు ఉన్నారని, నియోజకవర్గంలో సగానికి పైగా టీచర్లను బదిలీ పేరుతో బదిలీచేశారని, జడ్పీచైర్మన్ ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియదని ఆయయన అన్నారు. పాలారు డ్యాము కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గత 6సంవత్సరాలుగా చెబుతున్నదని, కానీ కట్టిన దాఖలాలు లేవని, నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారైందని, అభివృద్ధి కుంటపడిందని, శాంతిభద్రతలు కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. నిరంతరం సమస్యల పరిష్కారం కోసం అదికారులకు చర్చలు చేస్తానని, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినా దిగులుపడకండని పేద ప్రజలకు తోడుగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఆంజనేయరెడ్డి, జడ్పీటిసి బాలాజినాయక్, ఎంపిటిసి అలివేలుమంగమ్మ, విజలాపురం బాబు, మునస్వామి, పట్రనారాయణ, సర్పంచ్ రామక్రిష్ణప్ప, రవి, నారాయయణ, సీతాపతి తదితరులు పాల్గొన్నారు.
రాశి ఫలాలు






