Andhraprabha
Last Updated Mar 12 2010, 19:11:59, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

రాష్ట్రీయం 

ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంలో తేల్చుకుంటాం

ఆంధ్రప్రభ ప్రతినిధి  -   Tue, 9 Feb 2010, IST
  • మంత్రి మాణిక్యవరప్రసాద్‌
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

గుంటూరు, కెఎన్‌ఎన్‌ బ్యూరో: ముస్లిం మైనారిటీలకు విద్యారంగంలో అమలుచేస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యంకాదని, దీనిపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయనున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ స్పష్టం చేశారు. సోమవారం గుంటూరులో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16ను అనుసరించి చట్టబద్ధంగా వెనుకబడిన సామాజిక, ఆర్ధిక వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించే వెసులుబాటు ఉందన్నారు. ముస్లిం మైనారిటీలు గత ఐదారు దశాబ్దాల కాలంగా విద్యారంగంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తించి రిజర్వేషన్లను అమలులోకి తెచ్చారన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ల ఆవశ్యకతపై జస్టిస్‌ రంగనాధ్‌ మిశ్రా కమిషన్‌ పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించిందని, దాని ప్రాముఖ్యతను హైకోర్టు గుర్తించకపోవటం విచారకరమన్నారు.

గతంలో కూడా మండలి కమిషన్‌ తదితర అంశాలపై హైకోర్టు సాంకేతికపరమైన అంశాలను సాకుగా చూపి ప్రజా వ్యతిరేక తీర్పులు వెలువరించినప్పటికీ సుప్రీం కోర్టులో తగిన న్యాయం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల విషయంలో కూడా సుబ్రహ్మణ్యం, కృష్ణమీనన్‌ కమిషన్ల సిఫార్సుల వివరాలు తగినంతగా లేవనే సాకుతో హైకోర్టు తీర్పు వెలువరించటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రప్రభుత్వం కాకుండా స్వయంగా తాను ప్రముఖ న్యాయవాది కన్నాభిరన్‌ సహకారంతో లిఖితపూర్వకంగా వాదనలను హైకోర్టుకు సమర్పించామని ఇదే స్ఫూర్తితో సుప్రీం కోర్టులో తానే స్వయ ంగా రిజర్వేషన్ల అమలుకు ఉద్యమిస్తామని తెలిపారు. ముస్లింలలో కూడా సామాజిక, ఆర్ధికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో ముస్లింలు అందరితో సమానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉండాలనే ఆకాంక్షతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల ఆవశ్యకత పూర్తిగా ఉందన్నారు.

గాలి వ్యాఖ్యలు అర్ధరహితం

ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి రామచంద్రరావు, జనాదరణ కలిగిన ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై నగరి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యలు చేయటం అర్ధరహితమన్నారు. సీనియర్‌ నాయకునిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. మంత్రి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడనేది విస్మరించి తెలంగాణకు వత్తాసు పలకటం సమంజసం కాదన్నారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

రాష్ట్రీయం ఇతర విశేషాలు

  • జర్నలిస్టుల వృత్తినైపుణ్యం పెంపుదలకు కృషి
  • చేనేత కార్మికుల సమస్యలపై చర్చకు విపక్షం పట్టు
  • ఎన్‌టిఆర్‌ అపురూప చిత్రాల పోటీలో శ్రీ పతి రాజేశ్వర్‌కు ప్రథమ బహుమతి
  • సికింద్రాబాద్‌ - నిజాముద్దీన్‌ నాన్‌ స్టాప్‌ ఎక్స్‌ ప్రెస్‌ను 14న ప్రారంభించనున్న సిఎం
  • ఎమ్మెల్యేలతో చంద్రబాబు ముఖాముఖి
  • మీడియా పాయింట్‌ కబుర్లు
  • ఎన్ని నాటకాలాడినా బాబు సిఎం కారు : నల్లపు రెడ్డి
  • ఒయుకు నిధులు కేటాయించండి : కిషన్‌ రెడ్డి
  • 33 శాతం వస్తే పరిస్థితి ఏమిటి భగవాన్‌!: పొన్నాల

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.