క్రీడాప్రభ
సిలిక్‌కు తిరిగి జాగ్రెబ్ టైటిల్
జాగ్రెబ్, ఫిబ్రవరి 8 : క్రొయేషియాకు చెందిన టాప్ సీడ్ మారిన్ సిలిక్ వరుసగా రెండవ సంవత్సరం జాగ్రెబ్ ఇన్‌డోర్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో సిలిక్ 6 4, 6 7, 6 3తో అన్‌సీడెడ్ జర్మన్ మైకేల్ బెర్రెర్‌ను ఓడించాడు. ఇది సిలిక్‌కు ఐదవ కెరీర్ టైటిల్. 29 సంవత్సరాల జర్మన్‌ను ఓడించడానికి సిలిక్ రెండు గంటల 38 నిమిషాల వ్యవధి తీసుకున్నాడు. జర్మన్ బెర్రెర్‌కు ఇది తొలి ఎటిపి ఫైనల్. బెర్రెర్ అంతకుముందు సీడెడ్ క్రీడాకారులు జాన్కో టిప్సరెవిక్, విక్టర్ ట్రాయికీలను, సెమీ ఫైనల్స్‌లో 7 6, 7 5తోతోటి జర్మన్ ఫిలిప్ పెట్స్‌ష్నర్‌లపై సంచలన విజయాలు సాధించాడు. ఇది ఇలా ఉండగా, క్రితం నెల చెన్నై ఓపెన్‌లో టైటిల్‌ను సాధించడంతోను, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్ శ్లామ్ సెమీఫైనల్‌కు చేరుకోవడంతోను సిలిక్ ప్రప్రథమంగా ఈ సంవత్సరం ప్రపంచ టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించాడు.
రాశి ఫలాలు






