Andhraprabha
Last Updated Mar 12 2010, 02:22:13, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

క్రీడాప్రభ 

సెమీస్‌ చేరుకున్న ఫెడ్‌ కప్‌ విజేత ఇటలీ

క్రీడా ప్రతినిధి -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

లండన్‌, ఫిబ్రవరి 8: ఫెడరేషన్‌ కప్‌ విజేత ఇటలీ జట్టు ఖర్కీవ్‌లో యుక్రెయిన్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని చివరకు గెలిచి సెమీ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది. 4 1తోయుక్రెయిన్‌ను ఓడించిన ఇటలీ సెమీస్‌లో చెక్‌ రిపబ్లిక్‌తో తలపడుతుంది. మరొక సెమీఫైనల్‌లో అమెరికాను రష్యా ఢీకొంటుంది. కాగా, మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ అనా ఇవనోవిచ్‌కు ఫామ్‌ ఇంకా అందనంత దూరంలోనే ఉంటున్నది. బెల్‌గ్రేడ్‌లో సెర్బియాతో ఇవనోవిచ్‌ తన సింగిల్స్‌, డబుల్స్‌ మ్యాచ్‌లను ఓడిపోయింది. అయినప్పటికీ రష్యా జట్టు మిగిలిన మ్యాచ్‌లను కైవసం చేసుకోవడంతో 3 2తో సెర్బియాను ఓడించి సెమీస్‌కు అర్హత పొందింది. చెక్‌ జట్టు 3 2తో జర్మనీపైన, యుఎస్‌ 4 1తో ఫ్రాన్స్‌పైన గెలుపొందాయి. మొదటి రోజు యుక్రెయిన్‌తో 1 1తో సమ ఉజ్జీగా ఉన్న ఇటలీ రెండవ రోజు ప్రపంచ నంబర్‌ 12 ఫ్లావియా పెన్నెట్టా గెలుపుతో ముందంజ వేసింది. పెన్నెట్టా 7 5, 7 6తో అలోనా బొండారెంకోను ఓడించింది. ఫ్రాన్సెస్కా షియావోన్‌ 2 6, 6 1, 6 1తో కేటరీనా బొండారెంకోపై గెలిచి ఇటలీ ఆధిక్యాన్ని పెంచింది. 2008లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలుచుకున్నప్పటి తన ఫామ్‌ను ఇవనోవిచ్‌ ఇంకా ప్రదర్శించలేకపోతోంది. అలీసా క్లైబనోవాతో సింగిల్స్‌ పోటీలోను, జెలెనా జాన్కోవిచ్‌తో కలసి డబుల్స్‌ పోటీలోను ఇవనోవిచ్‌ కేవలం ఐదు గేములు గెలుచుకున్నది. ఇవనోవిచ్‌ ఫామ్‌ కోసం తంటాలు పడుతుండగా మరొకవైపు అమెరికన్‌ మెలానీ ఔడిన్‌ అంతకంతకూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నది. ఉత్తర ఫ్రాన్స్‌లోని లైవిన్‌ పట్టణంలో ఔడిన్‌ సాయంతో అమెరికా ప్రత్యర్థి ఫ్రాన్స్‌ను ఓడించింది. శనివారం యుఎస్‌కు 2 0 ఆధిక్యాన్ని సాధ్యం చేసిన 18 సంవత్సరాల ఔడిన్‌ ఆదివారం 7 6, 6 4తో జూలీ కాయిన్‌పై విజయంతో తన జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. కాగా, ఫెడరేషన్‌ కప్‌ సెమీఫైనల్స్‌ ఏప్రిల్‌ 24, 25 తేదీలలో జరుగుతాయి.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

క్రీడాప్రభ ఇతర విశేషాలు

  • ఐపిఎల్‌ తొలిపోరులో దక్కన్‌ చార్జర్స్‌తో రైడర్స్‌ తొలిపోరు
  • ఇంగ్లాండ్‌ అవుట్‌ సెమీస్‌లో జర్మనీ
  • ఏడో స్థానంపై ఇండియా టార్గెట్‌
  • ఐపిఎల్‌ 2010 కీపర్‌ కెప్టెన్‌లలో ఎవరిది పైచేయి!
  • జెర్సీ మార్పు రైడర్స్‌ గీతను మారుస్తుందా?
  • రోచ్‌పైనే దక్కన్‌ ఆశలు
  • పాక్‌కు ఆఖరి స్థానం
  • ఆస్ట్రేలియాకు సీరీస్‌
  • అసీస్‌తో డచ్‌ జట్టు ఓటమి

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.