Andhraprabha
Last Updated Mar 10 2010, 04:14:43, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

కడప 

జెఎసి విద్యార్తుల అరెస్ట్‌కు నిరసనగా రాస్తారోకో

కెఎన్‌ఎన్  -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

బద్వేలు, ఫిబ్రవరి 8 (కె.ఎన్‌.ఎన్‌) : రాష్ట్రాన్ని చీల్చ వద్దని సమైక్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ది ఉంటుందని ఈ విషయయాన్ని స్వయంగా వినతి పత్ర రూపంలో రాష్ట్ర గవర్నర్‌కు అందచేయడానికి బయలు దేరిన సమైక్యాంద్రా జెఎసి సభ్యులను అర్దరాత్రి పూట అరెస్ట్‌ చేయడం దారుణమని టియన్‌యస్‌యఫ్‌ నాయకులు పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న విద్యార్తులను అరెస్ట్‌కు నిరసనగా జెఎసి పిలుపు మేరకు సీమాంద్ర విద్యాసంస్థల బంద్‌ నేపద్యంలో సోమవారం పట్టణ నాలుగురోడ్ల కూడలిలో మానవహారం నిర్మించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా టియన్‌యస్‌యఫ్‌ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రాన్ని చీల్చాలని స్వార్ద రాజకీయంతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న రాజకీయ నాయుల మాటలు విద్యార్దులు మోసపోవద్దని సమైక్యాంద్ర జెఎసి తెలంగాణ విద్యార్దులకు హితవు పలికారుల. ఈ నేపద్యంలో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వరకు సమైక్యాంద్ర జెఎసి ఆద్వర్యంలో సీమాంద్ర యూనివర్శిటిల విద్యార్దులు బృందం హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టిన నేపద్యంలో క్రిష్ణాజిల్లా నందిగామా వద్ద అర్దరాత్రి 11 గంటలకు విద్యార్దులను అరెస్ట్‌ చేయడం దారుణం అన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేపట్టిన విద్యార్దులను అరెస్ట్‌లతో రెచ్చకొట్టడం తప్ప మరేమి కాదన్నారు. విద్యార్దులను ఉగ్రవాదులలాగా, నక్సలైట్లలాగ పరిగణించి అర్దరాత్రి అరెస్ట్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు.రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేస్తున్న సబితా ఇంద్రారెడ్డి కేవలం తెలంగాణకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా అభిప్రాయం వ్యతిరేకంగా రాష్ట్రాన్ని చీల్చడం సరికాదని ఇక నైనా రాష్ట్ర విభజనను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టియన్‌యస్‌యఫ్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి తిరుమలకొండయ్య,నాయుడు, కాశి,సురేంద్ర,ఏఐయస్‌యఫ్‌ నాయకులు చంద్ర ,ప్రతీప్‌కుమార్‌, ప్రదీప్‌ పాఠశాల యాజమాన్యం , విద్యార్దులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.