కడప
శివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయండి ఆర్డీఓ వెంకటరమణారెడ్డి
రాజంపేట, ఫిబ్రవరి 8 (కె.ఎన్.ఎన్) మహా శివరాత్రి పర్వదినాన్ని అత్తిరాలలో ఈసారి ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఆర్డీఓ వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో అత్తిరాల ఉత్సవాలపై మండల స్థాయి అధికార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అత్తిరాల ఆర్చి నుంచి దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు తొలగించి శుభ్రపరచాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, స్నానాలు చేయుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి పోలీసు యంత్రాంగం, రెవిన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భక్తులకు నీటి సమస్య రాకుండా ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ శ్రద్ద వహించాలని అన్నారు. భక్తులు దేవుని దర్శించుటకు విరివిగా బాలికేడ్లు ఏర్పాటు చేయాలని పారిశుధ్య లోపం కలుగకుండా డివిజినల్ పంచాయతీ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కృష్ణకుమార్, తహశిల్దార్ గుణభూషన్ రెడ్డి, సిఐ రామరాజు, ట్రాన్సుకో ఎఇ వెంకటరమణా, ఎంపిడిఓ వెంకటరమణారెడ్డి, మెడికల్ అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ తహశిల్దార్, తదితర్లు పాల్గొన్నారు.
రాశి ఫలాలు






