కడప
అ ర్హులకు కార్డులు, పింఛన్లు మంజూరు చేయండి
-
ఎమ్మెల్యే డాక్టర్ డియల్
బ్రహ్మంగారిమఠం, ఫిబ్రవరి 8 (కె.ఎన్.ఎన్) : మండలంలో గత ఏడాది నిర్వహించిన సామాజిక తనిఖిలో తొలగించిన పింఛన్లు, రేషన్ కార్డులు , ఇందిరమ్మ గృహాలు సంబంధించిన అర్హులకు తిరిగి చెల్లించాలని మైదుకూరు శాసనసభ్యులు డియల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తొలగించ బడిన కార్డుల విషయం పై అధికారులతో, లబ్ది దారులతో చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదల కొరకు ఏప్రిల్ నెలలో భూ పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్బంగా మండలంలో కూడా భూమిలేని పేదవారైన ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 500 మందికి 500 ఎకరాలు పంపిణి చేస్తామని ఆయన అన్నారు. మండలంలో 11 వందలకు పైగా తొలగించిన కార్డులన్నింటిని పరిశీలించడానికి నేటి నుంచి ఒక్కొక్క గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి పది రోజులలో తిరిగి అర్హులకు అందచేస్తామని యంపిడిఓ శివప్రసాద్ ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే నాగిశెట్టిపల్లె మాలవాడవెనక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పేదల ఇండ్ల స్థలాలకు కేటాయించాలని తహసిల్దార్ సాయినాద్‌కు సూచించారు. అలాగే మల్లెపల్లె, పెద్దిరాజుపల్లె లోని అసంపూర్తిగా ఉన్న పాఠశాలలకు అదనంగా నిధులు కేటాయించేలా చూడాలని యంపిడిఓకు ఆయన సూచించారు. స్తానికేతరులైన ఒంటిమిట్ట మండలానికి చెందిన కొందరికి బి.మఠం మండలంలో 80 ఎకరాలు భూమిని ఇవ్వడం పై ఒకింత అధికారుల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విఆర్‌ఓలతో చర్చిస్తూ మండలంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా సర్వే నిర్వహించి ఏప్రిల్ 14 దిరసవంచెలో నిర్వహించే భూ పంపిణి కార్యక్రమానికి 500 ఎకరాలు భూమిని సిద్దం చేయాలన్నారు. బూదవాడలోని భూమి రద్దు చేసి పేదలకు పంచాలని సంబందిత విఆర్‌ఓకు సూచించారు. మండల కేంద్రంలో ఉన్న నరసన్నపల్లె దళితులకు సంబందించిన భూములు సియల్‌డిపికి ఎంపిక కావడంతో భూమిని అభివృద్ది చేసుకోవడానికి బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వ అడ్డం కావడంతో భూములలోకి వెళ్ళలేక పోతున్నామని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆయన అధికారులతో ఫోన్‌లో సంప్రదించి దళితుల భూములలోకి వెళ్ళడానికి చిన్నపాటి బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యంపిపి మాలెపాటి సుబ్బారావు ,యంపిడిఓ శివప్రసాద్, తహసిల్దార్ సాయినాద్, విఆర్‌ఓలు ,ఆర్‌ఐ నాగభూషణం, స్తానిక కాంగ్రెస్ నాయకులు యస్‌ఆర్.శ్రీనివాసరెడ్డి, ఉప ఎంపిపి పోలిరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
రాశి ఫలాలు






