Andhraprabha
Last Updated Mar 12 2010, 05:47:07, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

కడప 

ప్రజావాణిలో ఆర్డీఓకు ఫిర్యాదులు

కెఎన్‌ఎన్  -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

జమ్మలమడుగు, ఫిబ్రవరి 8 (కెఎన్‌ఎన్‌): జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా వాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్‌ పరిధిలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు ప్రజావాణిలో పాల్గొని తమ సమస్యలను ఆర్డీఓ ఎంవి సుబ్బారెడ్డి దృష్టికి వినతిపత్రం ద్వారా అందజేశారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు మండలం నంగనూరు పల్లెకు చెందిన బైరగాని భాగ్యలక్షుమ్మ తమ గ్రామంలోని చౌకదుకాణం డీలర్‌ ప్రతి నెలా 20 కార్డులకు రేషన్‌ను పంపిణీ చేయడం లేదని, ప్రొద్దుటూరు హోమస్‌పేటకు చెందిన రాములమ్మ రింగురోడ్డుకు కోల్పోయిన 6.25 సెంట్ల స్థలానికి పరిహారం అందేలా చూడాలని, చిన్నముడియం గ్రామానికి చెందిన ముక్కమల్ల లక్ష్మీనారాయణమ్మ, ఎత్తపు వెంకట్రామిరెడ్డిలు తమవి బోగస్‌ పట్టాలని ఆరోపిస్తూ పెద్దముడియం తహశీల్దార్‌ గంగులు తమకు పట్టాదారు పాసు పుస్తకాలు విషయమై పలుమార్లు కార్యాలయం చుట్టూ త్రిప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించి డీలర్‌ రేషన్‌ సక్రమంగా ఇస్తున్నాడో లేదో స్వయయయంగా విచారిస్తామని, రింగు రోడ్డుకు కోల్పోయిన స్థలానికి ఈ నెల 15 వ తేదీ పరిహార క్రింద రూ. 34 వేల చెక్కును తీసుకొనిపోవాలని అలాగే పట్టాదారు పుస్తకాల విషయం విచారిస్తామని తెలిపారు. దీంతో బాధితులు ఆర్డీఓ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

కడప ఇతర విశేషాలు

  • బ్రహ్మణి స్టీల్‌పై రాద్ధాంతం మానుకో...
  • నేటి నుంచి మొల్ల జయంతి ఉత్సవాలు
  • 10వతరగతి పరీక్షలకు రైటింగ్‌ ప్యాడ్స్‌ పంపిణీ
  • నత్తనడకన ఇన్‌టెక్‌ వెల్‌ పనులు
  • 11వంట గ్యాస్‌ సిలెండర్లు స్వాధీనం
  • ‘రహదారుల పనుల పరిశీలన
  • దళారుల ప్రమేయం లేకుండా పంటల బీమా పంపిణీ
  • తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
  • ఎల్లలు దాటుతున్న ఎర్రబంగారం

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.