కడప
ఫిర్యాదులకు స్పందించండి ఎస్పీ చౌహాన్
కడప క్రైం, ఫిబ్రవరి 8 (కెఎన్‌ఎన్): జిల్లా నలుమూలల నుండి ప్రజలు అనేక సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్‌సెల్ కార్యక్రమానికి వస్తుంటారని పోలీసు యంత్రాంగం వారి ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ డిఎస్ చౌహాన్ పేర్కొన్నారు. సోమవారం గ్రీవెన్‌సెల్‌లో భాగంగా ఆయన వినతులు స్వీకరించారు. తాను అంధుడనని, తన భార్యను తన తమ్ముడు జైపాల్ తీసుకెళ్లాడని బి.మఠం పలుగురాళ్లపల్లెకు చెందిన ఎర్రంపల్లె బాలశౌరి ఫిర్యాదు చేశాడు. 9సంవత్సరాల క్రితం లక్షరూపాయల నగదు, 15తులాల బంగారం ఇచ్చి తనకు చాపాడు మండలం పెద్దచీపాడుకు చెందిన ఓబులేసు కుమారుడు మనోహర్‌కు ఇచ్చి వివాహం చేశారని,మరో రూ.50వేలు అదనపు కట్నం తీసుకురావాలని పుట్టింటికి మూడురోజుల క్రితం పంచాయతీ చేయించుకొని రెండవపెళ్లి చేసుకున్నాడని రాజమ్మ అనే మహిళ ఎస్పీ ముందు వాపోయింది.తమకు ఇద్దరు కుమారులను ఇల్లు లాక్కునేందుకు వేధిస్తున్నాడంటూ గోపయ్య, గంగయ్యలు తెలిపారు. తన స్థలాన్ని ఖాసింపీర్ ఆక్రమించాడని సిద్ధవటం మాబుసాబ్ ఫిర్యాదుచేశాడు.
రాశి ఫలాలు






