అంతర్జాతీయం
చిన్నపాటి దాడులపై అల్ ఖైదా దృష్టి
వాషింగ్టన్, ఫిబ్రవరి8: గుర్తించి ఎదుర్కో వడానికి వీలు లేకుండా ఆల్ ఖైదా చిన్నపాటి దాడులు చేయాలనే ప్రయత్నాలను సాగిస్తున్నట్లు అమెరికా ఉగ్రవాద నిరోధ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోర్ట్ హుడ్, టెక్సాస్‌ల్లో షూటింగ్ విధ్వంసం, విమానంలో బాంబు పేలుడు విఫలయత్నం ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది వాషింగ్టన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతుందని అంటున్నారు. విజయం కోసం తహతహలాడు తున్న ఆల్ ఖైదా ఘోర కార్యానికి ఒడిగట్టే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఆల్ ఖైదా చుట్టూ ఉచ్చు బిగిస్తున్న తరుణంలో తరుణోపాయం కోసం ఆ సంస్థ నాయకులు ఆలోచన చేస్తున్నారని సెనేట్ ఇంటలిజెన్స్ కమిటీ మాజీ స్టాఫ్ డైరెక్టర్ ఆండీ జాన్సన్ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఆల్ ఖైదా దాడి చేయవచ్చునని నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ డెన్నిస్ సి బ్లెయిర్ అన్నారు.
రాశి ఫలాలు






