అంతర్జాతీయం
ఎండ్యూవర్ ఉపగ్రహ ప్రయోగం
కేప్‌కెనవరల్(యుఎస్‌ఎ), ఫిబ్రవరి 8: విశ్వంలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి రెండు పరికరాలను చేర్చడానికి ఉద్దేశించిన ఉప్రగహం ఎండ్యూవర్‌ను స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.14గంలకు(ఉదయం 9.14గం. జిఎంటి) ప్రయోగించారు. ఆదివారం ఉదయం ఆకాశం మేఘావృతం కావడంతో నాసానుంచి ప్రయోగించాల్సిన ఎండ్యూవర్‌ను వాయిదా వేశారు. అంతరిక్ష వ్యోమగాములు తమ కేంద్రంనుంచి బయట పరిసరాలను వీక్షించడానికి ఉపయోగపడే డూమ్ ఆకారంలోవుండే 'కపోలా'ను ఎండ్యూవర్ స్పేస్ స్టేషన్‌కు చేరవేస్తుంది. కాగా, అంతరిక్ష కేంద్రానికి అవసరమైన పరికరాలు, వ్యోమగాములకు అవసరమైన సామ గ్రిని చేర్చడానికి మరో నాలుగు ఉప గ్రహాలను ప్రయోగించాల్సివుంది.
రాశి ఫలాలు






