అంతర్జాతీయం
ద్వైపాక్షిక చర్చలపై భారత్ వెనకడుగు వేసింది:ఖురేషీ
ఇస్లామాబాద్, ఫిబ్రవని 8: ద్వైపాక్షిక చర్యలపై ముందుగా వెనకడుగువేసింది భారత్ మాత్రమేనని, పాకిస్తాన్ కాదని విదేశాంగమంత్రి షా మహ్మద్ ఖురేషి పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు కొనసాగించబోమని ముందుగా భారత ప్రభుత్వమే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ పట్టణంలో ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో ఖురేషీ మాట్లాడుతూ పాక్‌తో చర్చలు కొనసాగించబోమని ప్రకటించిన భారత్ రెండు రోజుల క్రితం పాక్‌తో సంబంధాలు పునురుద్ధరిస్తామని ప్రకటించిందని తెలిపారు. పాకిస్తాన్ ఎవరికీ తలవంచదని, తాను ఎప్పుడూ ఎవరిముందు మోకరిల్లలేదని ఆయన చెప్పారు. కాశ్మీర్ వివాదమైనా, మరే సమస్యపైనైనా పాకిస్తాన్ తన వాదనను బలంగా వినిపిస్తుందని ఖురేషీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలలో కాశ్మీర్ వివాదానికి సంబంధించిన 8 అంశాలకు పరిష్కారం కనుగొనాల్సివుందని ఖురేషీ తెలిపారు.
రాశి ఫలాలు






