Andhraprabha
Last Updated Mar 12 2010, 02:22:13, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

ముఖ్యాంశాలు 

అక్కడ ఎన్నికల తాయిలంముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు

apr -   Tue, 9 Feb 2010, IST
ముఖ్యాంశాలు
  • పశ్చిమ బెంగాల్‌ సిఎం బుద్ధదేవ్‌ వెల్లడి
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

కోల్‌కతా, ఫిబ్రవరి 8 : పశ్చిం బెంగాల్‌లో ప్రభుత్వోద్యోగాల్లో ముస్లింలకు ఇతర వెనుకబడిన తరగతుల(ఒబిసి) కోటా కింద ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య ప్రకటించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీఒని రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిన రోజునే (సోమవారంనాడే) బుద్ధదేవ్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. సాంఘిక, ఆర్థక, విద్యా రంగాల్లో వెనుకబడిన ముస్లింలకు ఈ పది శాతం రిజర్వేషన్లను కల్పించాలని వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం నిర్ణయించినట్టు బుద్ధదేవ్‌ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఈ విషయమై రంగనాథ మిశ్రా కమిటీసిఫార్సులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని బుద్ధదేవ్‌ చెప్పారు. ఈ కమిటీ నివేదికపై కేంద్రం స్పందన వచ్చే వరకూ వేచి ఉండకుండా ఈ నివేదికను అమలు జేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు భట్టాచార్య చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు (ఒబిసిలకు) రిజర్వేషన్లను అమలు జేస్తామని ఆయన చెప్పారు. సాంఘిక, ఆర్థిక,విద్యా రంగాల్లో వెనుకబడిన ముస్లింలను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందనీ, ఒబిసిలకు రాష్ట్రంలో 7 శాతం రిజర్వేషన్లు అమలు జేస్తున్నామని ఆయన చెప్పారు. ముస్లింలలో వెనుకబడిన వర్గాలుగా గుర్తించిన 15 గ్రూపులకు ఉద్యోగాల్లో ఈ నాలుగు శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోనీ హైకోర్టు కొట్టి వేసింది.దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ని దాఖలు చేయవలసిందిగా అడ్వొకేట్‌ జనరల్‌ డిఎస్‌ ఆర్‌ మూర్తిని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆదేశించారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

  • ఆర్థిక వ్యవస్థకు తూట్లు దొంగ నోట్లు
  • జంట హత్యల కేసులో 16 మందికి జీవిత ఖైదు
  • మహిళా బిల్లుపై బిజెపిలో లుకలుకలు
  • అత్యంత ధనవంతుడు కార్లోస్‌ స్లిమ్‌
  • నేటి నుంచే క్రికెట్‌ పండగ
  • రుణ మాఫిలో ఘోర వైఫల్యం
  • మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్‌హంట్‌ షురూ
  • జగన్‌ను పిసిసి అధ్యక్షుడిని చేస్తే డిఎస్‌ని ఎక్కడికి పంపిస్తారు: జెసి
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై యుపిఎ వెనుకడుగు?

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.