ముఖ్యాంశాలు
రుచిక అత్యాచారం కేసు నిందితుడు రాథోడ్‌కు కత్తి పోట్లు
చండీగఢ్, ఫిబ్రవరి 8 : రుచిక అత్యాచారం కేసుపై విచారణ జరుగుతున్న ఇక్కడి జిల్లా కోర్టు వెలుపల సోమవారంనాడు ఈ కేసులో నిందితుడు, మాజీ డిజిపి ఎస్.పి.ఎస్. రాథోడ్‌పై ఒక యువకుడు కత్తితో దాడిజరిపి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. కోర్టునుంచి వెలుపలకు వస్తున్న రాథోడ్ ఫోటోను తీసేందుకు యత్నించి ఎడమ దవడపై చాకుతో పొడిచి, పలుసార్లు పిడిగుద్దులు గుద్దడంతో ముఖంనుచి రక్తం చిమ్మింది. గాయానికి చేతిరుమాల నొక్కి పట్టుకొని రాథోడ్ తన కారులో ఎక్కాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆ యువకుణ్ని పట్టుకున్నారు. కోర్టులో రహస్య విచారణ అనంతరం బయటకు వచ్చిన రాథోడ్‌తో మాట్లాడేందుకు మీడియాకు చెందిన వారు వేచివుండగా ఆ యువకుడు ఫోటోలు తీసేందుకు యత్నించాడు. కత్తిని బయటకు తీసి రాథోడ్ ముఖంపైనా చేతిపైనా పొడిచాడు. ఆ యువకుని పోలీసులు సెక్టర్ 17 పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇది యిలా ఉండగా తన గాయానికి ప్రథమ చికిత్స చేయించుకొని తిరిగి విచారణలో పాల్గొనేందుకు రాథోడ్ కోర్టుకు వచ్చారు.
రాశి ఫలాలు






