ముఖ్యాంశాలు
జూ.ఎన్టీఆర్ స్పందించాలి: హరీష్
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : 'అదుర్స్' సినీ నిర్మాత కొడాలి నాని ఉన్మాదిలా మతిభ్రమించి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడనీ, సినిమాలకు, సమైక్యాంధ్రకు ముడిపెడితే తెలంగాణాలో వారి సినిమాలు ఎలా నడుస్తాయో చూస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు హరీష్‌రావు వ్యాఖ్యానిం చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఉద్యమంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సినిమాలకు, సమైక్యాంధ్ర ఉద్యమా నికి సంబంధమున్నట్లుగా ఆయన మాట్లాడడాన్ని హరీష్‌రావు తప్పుబట్టారు. సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్న తీరు తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ఉందని, తనకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడు తున్నాడనీ, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హరీష్‌రావు సూచించారు. 'అందితే జుట్టు లేకుంటే కాళ్ళు' అనే చందంగా మాట్లాడు తున్నారనీ, అదుర్స్ సినిమా విడుదలయ్యే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తాను తెలంగాణ గడ్డపైనే పుట్టాననీ, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చస్తాను అంటూ బ్రతిమిలాడాడని, పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ రకమైన విజ్ఞప్తులే చేయడం వల్ల తాము అదుర్స్ సినిమాను అడ్డుకోలేదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఈ సినిమాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని వేడుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
'అదుర్స్'ను అడ్డుకోవడం పెద్ద గొప్పేమీ కాదనీ, అదొక విషయం కూడా కాదన్నారు. కొడా లి నాని తెలంగాణ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక తెలుగు చలనచిత్ర పరి శ్రమ తరఫున మాట్లాడుతున్నాడా? అనే విష యాన్ని తేల్చాల్సిందేనన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చలనచిత్ర పరిశ్రమ నాని వ్యాఖ్యలపై స్పందిం చాలని ఆయన డిమాండ్ చేశారు. కొడాలి నాని కెసిఆర్‌ను, ఆయన కుటుంబసభ్యులను అవహేళన చేయడం కాదు, ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని, యావత్ తెలంగాణ జాతిని, ప్రజల మనోభావాలను కించపరచినట్లుగా ఉందని హరీష్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల సహనానికి హద్దు ఉంటుందనీ, హద్దు దాటితే మీరె వరూ తెలంగాణాలో తిరగలేరని ఆయన హెచ్చరిం చారు. కొడాలి నాని వెంటనే తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
'మా' ఖండనను స్వాగతిస్తున్నాం : హరీష్‌రావు
'అదుర్స్'చిత్ర నిర్మాత, తెదేపా ఎమ్మెల్యే కొడాలి నాని తెలంగాణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఖండిం చడం పట్ల తెరాస నేత హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ 'మా' చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాశి ఫలాలు






