ముఖ్యాంశాలు
విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టండి
-
మంత్రివర్గ సహచరులకు సిఎం ఆదేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఈనెల 15వ తేదీనుంచి ప్రారంభం కానున్న అసెంబ్లిd బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసి ద్ధమవుతోంది. మంత్రివర్గ సహచర లతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ధీటైన సమాధానా లిచ్చేందుకు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య పిలుపునిచ్చినట్లు సమాచారం. మంత్రులందరితో ఒకేసారి భేటీ కాకుండా మూడు, నాలుగు విడతలుగా సమావేశాలు ఏర్పాటుచేసి జిల్లాల వారీగా వారిని అప్రమత్తం చేయా లని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం సచివాలయంలో పదకొండు మంది మంత్రులతో రోశయ్య ప్రత్యేకంగా సమావేశమై సుమారు రెండు గంటలపాటు చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరినీ ఒకేతాటిపైకి తీసుకురావా లన్న సంకల్పంతో మంత్రుల వ్యక్తిగత అభిప్రాయాలను కూడా తీసుకున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాసనసభ నిర్వహణ కోసం ఏర్పాటైన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించు కుంది. ప్రాంతీయ వాదాలు, ఉద్యమాలు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ప్రజా సమస్యలపై అసెంబ్లిdలో విపక్షాల నుంచి ఎదురయ్యే అంశాలు, వాటిపై ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో రోశయ్య తన మంత్రివర్గ సహచరులకు తగు సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పనితీరు పట్ల సమిష్టి బాధ్యతతో వ్యవహరిం చాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికమాం ద్యం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిధుల కొరత, రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయిం పులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాలపై చర్చ జరిగింది.
ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు చెల్లవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎదురయ్యే పరిణామాలను, తీసుకోవలసిన చర్యలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై శాసనసభలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను తగ్గించేందుకు ఇది ఆవశ్యకమని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయంపై మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, జె.గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలను, ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను కూడా ఈ సందర్భం గా వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా మంత్రి గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేనివి ధంగా అసెంబ్లిd సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులతో సమావేశం నిర్వహించడం, సభలో చర్చనీయాంశాలపై అభిప్రాయాలు తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే ప్రజా సమస్యలు, ఇతర రాజకీయ అంశాలపై ధీటైన సమాధానాలిచ్చేందుకు మంత్రులంతా సిద్ధం కావాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయాలని, ఆయా నియోజకవర్గాలపై సబ్జెక్టు నాలెడ్జీని పెంచుకోవాలని కూడా సూచించారన్నారు.
ముఖ్యమంత్రి రెండు రోజుల ఢిల్లిd పర్యటనలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, అహ్మద్ పటేల్‌లను కలిసి చర్చించిన అంశాలను తమకు వివరించారని తెలిపారు. రాష్ట్ర అంతర్గత భద్రతపై కేంద్రం దృష్టి కేంద్రీకరించిందని గీతారెడ్డి పేర్కొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్రధాని హామీ ఇవ్వడం, బియ్యం ధర తగ్గుముఖం పట్టడానికి పరిస్థితులు సానుకూలంగా మారడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శన మని చెప్పారు. అసెంబ్లిd సమావేశాలకు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా నిర్దిష్టమైన సమయ పాలన పాటించాలని సీఎం సూచించారన్నారు. అన్ని జిల్లాలో డిడిఆర్‌సి సమావేశాలు జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ముస్లిం మైనారిటీల రిజర్వేష న్లపై ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని మంత్రి గీతారెడ్డి స్పష్టంచేశారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమ య్యారని, ప్రభుత్వం వేయవలసిన ముందడుగు చర్యలపై చర్చించారని తెలిపారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేయవలసిందిగా అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించడం జరిగిందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లిd నియోజకవర్గాల అభివృద్ధి నిధులు (ఎసిడిపి) వెంటనే విడుదల చేయాలని మంత్రులంతా ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున మంజూరు చేయాలన్న తమ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లిdలో బిల్లు ప్రవేశపెట్టి చర్చించి నిర్ణయం తీసుకునేందుకు అంగీకరించారని పేర్కొన్నారు.
రాశి ఫలాలు






