Andhraprabha
Last Updated Mar 12 2010, 02:22:13, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

ముఖ్యాంశాలు 

నాగవైష్ణవి హత్య కేసులో వెంకట్రావ్‌ గౌడ్‌ అరెస్ట్‌

apr  -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

విజయవాడ, (కెఎన్‌ఎన్‌ బ్యూరో): చట్టపరమైన వత్తిళ్ళ నేపథ్యంలో చిన్నారి నాగవైష్ణవి దారుణ హత్యకేసులో ప్రధాన సూత్రధారునిగా అనుమానిస్తున్న వెంకట్రావ్‌ గౌడ్‌ను బెజవాడ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఐతే నిందితుని అరెస్ట్‌ను పోలీసులు గోప్యంగా ఉంచేందుకు విఫలయత్నం చేశారు. భారీ బందోబస్తుతో నిందితుని మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపొలిటన్‌ కోర్టులో సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. నిందితునికి 22వ తేదీవరకు రిమాండ్‌ విధించారు. అదే సమయంలో కేసు దర్యాప్తు నిమిత్తం వెంకట్రావ్‌గౌడ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ విషయంపై నిందితునికి నోటీసు జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇప్పటికే జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న మోర్లశ్రీనివాస్‌, జగదీష్‌లను పోలీసు కస్టడీకి పంపించాలనే పిటీషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అనేక నాటకీయ మలుపులు తిరుగున్న ఈ కేసులో వెంకట్రావ్‌ గౌడ్‌ అరెస్ట్‌ ప్రహసనం ఇలా ఉంది.

లిక్కర్‌ వ్యాపారి పలగాని ప్రభాకర్‌ కారు డ్రైవరు, కుమార్తె నాగవైష్ణవీ హత్యకేసుల్లో ప్రధాన సూత్రధారిగా అనుమానించిన పోలీసులు లిక్కర్‌ వ్యాపారి, పిఆర్‌పి నాయకుడు పి.వెంకట్రావ్‌ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు మోర్లశ్రీనివాస్‌, వి.జగదీష్‌ ఫోన్‌ నుంచి వెంకట్రావ్‌ గౌడ్‌కు ఫోన్‌ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఆధారంతోనే వెంకట్రావ్‌ గౌడ్‌ను రహశ్యప్రదేశంలో ఉంచి తీవ్రస్థాయిలో విచారించారు. ఎంత ప్రయత్నించినా వెంకట్రావు గౌడ్‌ నోరు విప్పలేదు. దీంతో బలమైన సాక్ష్యాలు లభించకపోవటంతో కుట్రదారునిగా నిర్ధారించటానికి పోలీసులు నానా హైరానా పడే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు వెంకట్రావ్‌గౌడ్‌ను అక్రమంగా నిర్బంధించారని అతని భార్య శ్రీదేవి సన్నద్దమైన సమాచారం అందటంతో పోలీసులకు ప్రత్యామ్నయ మార్గం కనిపించలేదు. కుట్రదారుడుగా కేసునమోదు చేసి, ఆపై పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తరువాతనే వెంకట్రావుగౌడ్‌ను అరెస్ట్‌ చేశారు. ఉదయమే ఒక వ్యాన్‌లో వెంకట్రావ్‌ను కోర్టు ఆవరణలకు తీసుకువచ్చారు. మీడియాకు దొరకని విధంగా కోర్టులో ప్రవేశపెట్టటానికి పథకం రచించారు. నేరుగా కోర్టు ద్వారం వరకు వ్యాన్‌ను తీసుకువెళ్ళి పోలీసులు చుట్టుముట్టి కోర్టు హాలులోకి తీసుకువెళ్ళారు. రిమాండ్‌ విధించిన తరువాత కూడా పోలీసులు వలయంగా ఏర్పడి వ్యాన్‌ ఎక్కించారు. ఐతే గతంలో ఏ కేసులోనైనా నిందితులను అరెస్ట్‌ చేసినప్పుడు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు పురోగతిని అధికారులు వివరించేవారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

  • ఆర్థిక వ్యవస్థకు తూట్లు దొంగ నోట్లు
  • జంట హత్యల కేసులో 16 మందికి జీవిత ఖైదు
  • మహిళా బిల్లుపై బిజెపిలో లుకలుకలు
  • అత్యంత ధనవంతుడు కార్లోస్‌ స్లిమ్‌
  • నేటి నుంచే క్రికెట్‌ పండగ
  • రుణ మాఫిలో ఘోర వైఫల్యం
  • మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్‌హంట్‌ షురూ
  • జగన్‌ను పిసిసి అధ్యక్షుడిని చేస్తే డిఎస్‌ని ఎక్కడికి పంపిస్తారు: జెసి
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై యుపిఎ వెనుకడుగు?

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.