Andhraprabha
Last Updated Mar 12 2010, 05:47:07, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

ముఖ్యాంశాలు 

ఆటోను ఢకొన్న భట్టి 'ఎస్కార్ట్‌'

apr -   Tue, 9 Feb 2010, IST
 ముఖ్యాంశాలు
  • ఐదుగురు మృతి
  • 9 మందికి గాయాలు
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

నల్గొండ, కెఎన్‌ఎన్‌ బ్యూరో: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ భట్టివిక్రమార్క ఎస్కార్ట్‌ వాహనం ఎదురుగా వెళ్తున్న వాహానాన్ని ఓవర్‌టెక్‌ చేస్తూ ఆటోను ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందారు. మరో 9మంది గాయపడగా వారిలో నలుగురి పరిస్ధితి ప్రమాదకరంగా ఉంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఖమ్మం నుంచి హైద్రాబాద్‌ వెళ్తుండగా ఆయనకు ఎస్కార్ట్‌గా వస్తున్న జీపు హైద్రాబాద్‌ నుంచి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టుకు వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన భార్యా భర్తలు జయచందర్‌గౌడ్‌ (35), అతని భార్య లింగమ్మ(29)తో పాటు హైదరాబాద్‌లోని సూరారానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాములు అక్కడికక్కడే మృతిచెందారు. అఖిల్‌ (5), కొయ్యలగూడెం గ్రామానికి చెందిన రాదాధేవి హైద్రాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. జయచందర్‌గౌడ్‌ కుటుంబం మొక్కు తీర్చుకునేందుకు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి బంధువులతో కలిసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో జయచందర్‌గౌడ్‌ కుమార్తె నిహారిక, అతని సమీప బంధువులు శివ, గుర్రం నరేందర్‌, గాయాలపాలయ్యారు. ఆటోను ఢీ కొట్టిన ఎస్కార్ట్‌ జీపులో ప్రయాణిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోలీసులు గంగరాజు, హరినాధ్‌, రాగ్జీ, నాగేశ్వర్‌రావు, లచ్చిరాం, ఎండి గౌస్‌లకు స్వల్ప గాయాలు అయ్యాయి. తన ఎస్కార్ట్‌ జీపు ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన, గాయపడిన వారిని కనీసం పట్టించుకోకుండా హైద్రాబాద్‌ వెళ్ళిపోయిన ప్రభుత్వ చీఫ్‌విప్‌పై ఆ ప్రాంత వాసులు ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. ఇందుకు నిరసనగా చౌటుప్పల్‌లోరాస్తారోకో నిర్వహించారు.

మృతులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ భట్టివిక్రమార్క ఎస్కార్ట్‌ వాహనం ఢీ కొన్న సంఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ. లక్షను సిఎం సహాయ నిధి నుంచి అందించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని ఐటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి తో పాటు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్త పర్చారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

  • ఆర్థిక వ్యవస్థకు తూట్లు దొంగ నోట్లు
  • జంట హత్యల కేసులో 16 మందికి జీవిత ఖైదు
  • మహిళా బిల్లుపై బిజెపిలో లుకలుకలు
  • అత్యంత ధనవంతుడు కార్లోస్‌ స్లిమ్‌
  • నేటి నుంచే క్రికెట్‌ పండగ
  • రుణ మాఫిలో ఘోర వైఫల్యం
  • మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్‌హంట్‌ షురూ
  • జగన్‌ను పిసిసి అధ్యక్షుడిని చేస్తే డిఎస్‌ని ఎక్కడికి పంపిస్తారు: జెసి
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై యుపిఎ వెనుకడుగు?

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.