Andhraprabha
Last Updated Mar 12 2010, 02:22:13, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

ముఖ్యాంశాలు 

కోర్టు తీర్పునకు నిరసనగా ఎంఐఎం సెక్రటేరియట్‌ ముట్టడి

apr  -   Tue, 9 Feb 2010, IST
ముఖ్యాంశాలు
  • గేట్లకు తాళం వేసినా గోడదూకే ప్రయత్నం
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 4శాతం రిజర్వేషన్లు చెల్లవంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల మజ్లీస్‌ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇందుకు నిరసనగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సోమవారం సచివాలయాలన్ని ముట్టడించారు. ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ ఓవైసీ, పాషా ఖాద్రీల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12.15 గంటలకు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఒక్కసారిగా ఎంఐఎం కార్యకర్తలు ముఖద్వారం వద్దకు దూసుకొచ్చారు. అప్పటికప్పుడు అప్రమత్తమైన సచివాలయ భద్రతా సిబ్బంది గేట్లకు తాళాలు వేసినప్పటికీ ప్రహారీగోడ ఎక్కి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు.

పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.దాదాపు 200 మంది కార్యకర్తలు నల్లజెండాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తగు విధంగా ముందడుగు వేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నగర పోలీస్‌ యంత్రాంగంతో పాటు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

  • ఆర్థిక వ్యవస్థకు తూట్లు దొంగ నోట్లు
  • జంట హత్యల కేసులో 16 మందికి జీవిత ఖైదు
  • మహిళా బిల్లుపై బిజెపిలో లుకలుకలు
  • అత్యంత ధనవంతుడు కార్లోస్‌ స్లిమ్‌
  • నేటి నుంచే క్రికెట్‌ పండగ
  • రుణ మాఫిలో ఘోర వైఫల్యం
  • మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్‌హంట్‌ షురూ
  • జగన్‌ను పిసిసి అధ్యక్షుడిని చేస్తే డిఎస్‌ని ఎక్కడికి పంపిస్తారు: జెసి
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై యుపిఎ వెనుకడుగు?

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.