బిజినెస్
4జి ప్రక్రియకు శ్రీకారం
న్యూఢిల్లిd, ఫిబ్రవరి 8 : ప్రభుత్వం ఒకవైపు 3వ జెనరేషన్ (3జి) స్పెక్ట్రం టెలిఫోనీకి వేలంపాటలు ఎప్పుడు నిర్వహించాలి అన్నదానిపై సంప్రతింపులు, చర్చలూ జరుపుతూనే ఉండగా టెలికాం రెగ్యులేటరి సంస్థ 'ట్రాయ్' తదుపరి స్థాయి (4జి) టెలికాం సర్వీసుల విషయంమై సంప్రతింపులూ చర్చల ప్రక్రియను సోమవారంనాడు ప్రారంభించింది. 4వ జెనరేషన్ లేదా 4జి సాంకేతిక పరిజ్ఞానంద్వారా అత్యంత వేగవంతంగా డౌన్‌లోడ్ సదుపాయం కలుగుతంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆల్ట్రా బ్రాడ్ బాండ్ అనికూడా వ్యవహిరిస్తున్నారు. ''4జి టెలికాం సర్వీసెస్‌కు సంబంధించిన అంశాల పరిశీలనకుగాను సంప్రతింపులు చర్చల ప్రక్రియను ఆరంభమైంది'' అని ట్రాయ్ చైర్మన్ జె.ఎస్.శర్మ చెప్పారు. ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టిన నేపథ్యంలో 3జి స్పెక్ట్రమ్ వేలంపాటలు త్వరలోనే ప్రారంభం కాగలవని కూడా ఆయన చెప్పారు. ''3జి విషయంలో తీవ్రజాప్యం చోటు చేసుకుంది. 4జి లేదా ఎల్‌టిఇ (లాంగ్ టెరమ్ ఎవల్యూషన్) విషయంలో ఇలా జాప్యం జరగరాదన్నది మా సంకల్పం. ఇతర దేశాలు 4జిని ఇప్పటికే ప్రారంబించాయి. అందువల్ల దీనివిషయంలో ముందుగానే చర్యలు చేపట్టాం.'' అని శర్మ అన్నారు. థర్డ్ జెనరేషన్ (3జి), సెకండ్ జెనరేషన్ (2జి) ప్రమాణాల వారసత్వంతో అత్యంత వేగవంతమైన అల్ట్రా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ సదుపాయాన్ని మొబైల్ వినియోగదారులకు, ఇతర వినియోగదారు లకు 4జి అందిస్తుంది అని ఆయన అన్నారు. సలహా సంప్రతింపుల పత్రాన్ని ఎప్పటికి విడుదల చేయగలరు అన్న విలేకరుల ప్రశ్నకు ''చాలా త్వరలో'' అని శర్మ బదులిచ్చారు. ఈ పత్రం పరిశ్రమ దారులకూ, దీనితో ప్రమేయం ఉండే వర్గాలకూ తర్జన భర్జనలూ, చర్చల నిమిత్తం పలు ప్రశ్నలను సంధిస్తుందని, ఆచర్చలూ, తర్జన భర్జనలూ, సందేహాల ఆధారంగా ట్రాయ్ తన సిఫారసులను రూపొందిస్త్తుందనీ ఆయన చెప్పారు.
ప్రభుత్వం 4జి టెలిఫోనీకి సంబంధించి సిఫారసులు చేయవసిందిగా ట్రాయ్‌ని కోరిందా అన్న విలేకరుల ప్రశ్నకు ''4జికి సంబంధించి అనేక అంశాలను పరిశీలించవలసి ఉంది. 3జికి జరిగిన మాదిరి 4జివిషయంలో జాప్యం జరుగరాదని భావిస్తున్నందున ఇందుకు సంబంధించిన పనిని లేదా క్రమాన్ని ప్రారంభించాం'' అని శర్మ బదులిచ్చారు.
రాశి ఫలాలు






