బిజినెస్
పన్నుల సంస్కరణల ప్రపంచ సంస్ధలో భారత్ కీలక భూమిక
న్యూఢిల్లిd, ఫిబ్రవరి 8 : అమలులో ఉన్న అంతర్జాతీయ పన్నుల పద్ధతులను మెరుగుపరచ డంద్వారా వర్థమానదేశాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రపంచ ఆర్థిక సహకారం, అభవృద్ధి సంస్థ (ఒసిఇడి) ఏర్పాటు చేయదలచిన టాస్క్ ఫోర్స్‌లో భరతదేశం ప్రధాన పాత్ర పోషించగలదని ఒసిఇడికి చెందిన ఉన్నత స్థాయి అధికారి ఒకరు అన్నారు. ప్రాథమికంగా ఒసిఇడి సంపన్న దేశాలతో ఏర్పడిన గ్రూపు. ఈ టాస్క్ ఫోర్స్ స్వరూపంగురించి అడిగిన ప్రశ్నకు ఇందులో 20నుంచి 30 దేశాలు సభ్యులని ఆ అధికారి చెప్పారు. ''ఈ టాస్క్ ఫోర్స్‌లో భారత దేశం పోషించే పాత్రపై భారత ప్రభుత్వంతో చర్చిస్తాం. భారత దేశంగనుక ఈ టాస్క్ ఫోర్స్‌లో చేరేందుకు ఆసక్తి చూపితే ప్రముఖ పాత్ర లేదా నాయకత్వ పాత్రను భారత్ పోషించగలదు. తన అనుభవాన్ని రంగరించి లక్ష్య సాధనకు భారత దేశం ఎంతగానో దోహదపడుతుంది'' అని ఒక వార్తా సంస్థకు పారిస్ నుంచి ఇ-మెయిల్ ద్వారా ఆ అధికారి తెలిపారు. వర్థమాన దేశాలు, ఎన్‌జిఒలు, వాణిజ్య సంస్థలుకూడా భాగస్వాములు కావడంద్వారా ప్రపంచ పన్నుల విషయాలలో ఈ టాస్క్ ఫోర్స్ పటిష్ఠమైన ఉమ్మడి పద్ధతులను అమలు చేసేందుకు సహాయ పడుతుంది అన్నది ఒఇసిడి అభిప్రాయం. నూతన ప్రపంచ పరిస్తితులలో వర్థమాన దేశాలకు ప్రయోజనం చేకూరేవిధంగా బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలలో పారదర్శకతను పెంపొందించి పన్నులనుంచి తప్పించు కునేందుకు వీలులేని ఒక కార్యక్రమాన్ని రూపొందిం చడం అన్నది ఈ టాస్క్ ప్రోర్స్ ప్రాధాన్యతా అంశాలలో ఒకటి అని ఆ అధికారి చెప్పారు. డూప్లి కేషన్ జరుగకుండా ఒక స్పష్టమైన, ప్రభావవంతమైన అమలు యంత్రాంగాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో త్వరలో ఒఇసిడి టాస్క్ ఫోర్స్ ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. లాంఛనంగా ఈ టాస్క్ ఫోర్స్ పన్నులు, అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతులను క్రోడీకరిస్తుంది అని ఒఇసిడి గతనెలలో ప్రకటించడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్‌లో ఎన్‌జిఒల భాగస్వామ్యాన్నిగురించి ప్రస్తావించి వీరి సంఖ్య ఎంత ఉండాలి అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ముగ్గురు ఎన్‌జిఒలు టాస్క్ ఫోర్స్‌లో ఉండగలరని ఆ అధికారి అన్నారు.
రాశి ఫలాలు






