బిజినెస్
7.2 శాతానికి ఆర్ధిక వృద్ధి రేటు
న్యూఢిల్లిd, ఫిబ్రవరి 8 : భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన 7.2 శాతం వృద్ధిరేటు సాధించగలదని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సాధించిన 6.5 శాతం కన్న ఇది ఎక్కువ కావడంతో ఆసియాలోనే మూడవ పె ద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మాంద్య స్థితి నుంచి త్వరితగతిన బయటపడు తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర గణాంక సంస్థ అంచనాల ప్రకారం వస్తు తయారీ రంగం 2009-10 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం మేరకు పెరిగే అవకాశం ఉంది. మాంద్య స్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను బయటకుతెచ్చే సత్తా ఆ రంగానికే ఉన్న విషయం తెలిసిందే.
ఆర్‌బిఐ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమీక్ష లోపల వడ్డీరేట్లను పెంచగలదన్న ఊహాగానాల నేపథ్యంలో అధికారిక అంచనాలు కూడా అదే దిశలో సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశ్చర్యకరంగా పెరుగుదల సాధించడంతో ఆర్‌బిఐ, ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి చెందిన అధికారులు తమ ప్రాథమిక అంచనాలను సవరించుకున్నారు. రెండో త్రైమాసికం లో పారిశ్రామిక ఉత్పత్తి ఒక్కసారిగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థ 7.9 శాతం మేరకు పెరిగింది. దేశ కర్మాగారాల ఉత్పత్తి నవంబర్‌లో 11.7 శాతానికి చేరుకోవడం ద్వారావరుసగా 11వ నెలలో కూడా అది విస్తృతమయినట్టయింది. వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి అంతకు ముందు ఏడాది 37.3 శాతం పెరగగా, వస్తుతయారీ రంగం ఉత్పత్తి 12.7 శాతం పెరిగింది. మాంద్యం కారణంగా బాగా దెబ్బతిన్న ఎగుమతి రంగం కూడా కోలుకునే మార్గంలో ప్రయాణిస్తోందని తాజా ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తు న్నాయి. డిసెంబర్‌లో ఎగుమతులు 9.3 వార్షిక పెరుగుదలతో 14.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 13 నెలల తగ్గుదల అనంతరం డిసెంబర్‌లోనే ఆ రంగం పెరుగుదలను సాధించింది. ఆర్థికవ్యవ స్థ త్వరిత గతిన విస్తృత వృద్ధి దిశకు తిరిగి తరలుతున్నా, ద్రవ్యోల్బణం మాత్రం ప్రభుత్వానికి ఆందోళనకారకం గా మారిందని విశ్లెషకులు చెబుతున్నారు.
రాశి ఫలాలు






