తాజావార్తలు
నాయుడుపేటలో గ్లాస్ ప్లాంట్
హైదరాబాద్: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గ్లాస్ ప్లాంట్ నిర్మాణానికి హిందూస్థాన్ నేషనల్ గ్యాస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి తమకు సహకరించవలసిందిగా కోరారు. ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. రూ.1000కోట్ల పెట్టుబడితో ఏప్రిల్ పెట్టుబడితో ఏప్రిల్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. తొలివిడత 480కోట్లు పెట్టుబడి పెడతారు. రోజుకు 600 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తారు. 2012నాటికి ప్లాంట్ పూర్తి చేయాలన్నది సంస్థ లక్ష్యంగా పెట్టుంది.
రాశి ఫలాలు






