తాజావార్తలు
మెజిస్ట్రేట్ ఎదుట హాజ రైన వెంకట్రావ్‌గౌడ్
విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకట్రావ్‌గౌడ్‌ను బెజవాడ పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ప్రత్యేక వాహనంలో భారీ పోలీసు బలగాల మధ్య ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద వెంకట్రావ్‌ను హాజరపరిచారు. నిందితుడికి ఈనెల 22వ తేదీ వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతన్ని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వెంకట్రావ్‌ను ఆదివారం సాయంత్రమే అరెస్టు చేసినట్లు సమాచారం. కారు డ్రైవర్ హత్య, వైష్ణవి ని కిడ్నాప్ చేసి హతమార్చడం తదనంతరం ఆమె తండ్రి ప్రభాకర్ గుండె పోటుతో చనిపోవడానికి వెంకట్రావునుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వెంకట్రావు నేరం అంగీకరించాడా లేదా అన్నది సందిగ్థంగా ఉంది.
రాశి ఫలాలు






