తాజావార్తలు
మలయాళం సినిమాలో అమితాబ్
కొచ్చి : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మలయాళం సినిమాలో నటించనున్నారు. దశాబ్దం క్రితం చోటు చేసుకున్న కాందహార్ విమాన హైజాక్ కథనంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో కలిసి ఆయన నటించనున్నట్లు ఆ చిత్రం దర్శకుడు మేజర్ రవి తెలిపారు. ఈమేరకు అబితాబ్‌తో చర్చలు జరిగాయని, సినిమాలో నటించుటకు అమితాబ్ సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. కాందహార్ విమాన హైజాక్ కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి 'కాందహార్ 'అనే నామకరణం చేయాలని భావిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. అమితాబ్ వీలును బట్టి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు.
రాశి ఫలాలు






