తాజావార్తలు
కార్మికులకు మద్దతుగా 17న తాడిపత్రి దిగ్బంధన : సిపిఐ
హైదరాబాద్: కార్మికులకు మద్దుతగా ఈనెల17న తాడిపత్రి పట్టణం దిగ్బంధన చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారాయణ తెలిపారు. కార్మికులపై అక్రమ కేసులు బనాయించిన మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డిని, ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డల ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదిత్య, బిర్లా గ్రూపుకు జెసి ఊడిగం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు దురదృష్టకరమని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దీనికి శాశ్విత పరిష్కారం కనుకొనాలన్నారు. ముస్లీం రిజర్వేషన్లకు భారతీయ జనతాపార్టీ మతం రంగు వేసిందని డాక్టర్ నారాయణ విమర్శించారు.
రాశి ఫలాలు






