తాజావార్తలు
2013నాటి కి నేనే కింగ్‌మేకర్ : బాబా రామ్‌దేవ్
హైదరాబాద్: 2013 నాటికి దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా అవతరిస్తానని ప్రముఖ యోగా గురువు బాబారామ్‌దేవ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దేశ రాజకీయాలను శాసించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి, పక్షపాత వైఖరి తగ్గితే తెలంగాణ సమస్యే ఉండదని రామ్‌దేవ్ అన్నారు. సినీ తారలెవ్వరూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలేదని విమర్శించారు. రిజర్వేషన్లతో ఎటువంటి అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, దొంగ నోట్ల చెలామణి జరుగుతున్న నేపథ్యంలో దేశంలో రూ.500, రూ.1000ల నోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రామ్‌దేవ్ డిమాండ్ చేశారు.
రాశి ఫలాలు






